బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 03, 2020 , 11:32:43

పాల్వంచ‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌.. ముగ్గురు అరెస్ట్‌

పాల్వంచ‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌.. ముగ్గురు అరెస్ట్‌

పాల్వంచ‌: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఐపీఎల్ బెట్టింగుకు పాల్ప‌డుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాల్వంచ మండలం నాగారంలో గ‌త కొంత‌కాలంగా క్రికెట్‌ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నార‌నే స‌మాచారంతో పోలీసులు శుక్ర‌వారం రాత్రి దాడి నిర్వ‌హించారు. బెట్టింగ్‌కు పాల్ప‌డిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.44 వేలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు న‌మోదుచేశామ‌ని పాల్వంచ రూర‌ల్ ఎస్ఐ సుమన్ తెలిపారు. 


logo