మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 16, 2021 , 20:45:17

అంతర్‌రాష్ట్ర గజదొంగ బాకర్‌ అలీ అరెస్ట్‌

అంతర్‌రాష్ట్ర గజదొంగ బాకర్‌ అలీ అరెస్ట్‌

హైదరాబాద్‌ : అంతర్‌రాష్ట్ర గజదొంగ బాకర్‌ అలీని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ చోరీ కేసులో పోలీసులు బీదర్‌ వెళ్లి కరడుగట్టిన నేరగాడు బాకర్‌ అలీని పట్టుకున్నారు. ఇటీవలే రాష్ట్రంలో 19 చైన్‌ స్నాచింగ్‌లు చేసిన ఇరానీ గ్యాంగ్‌ సభ్యుల్లో అలీ ఒకడు. ఇతడు డిసెంబర్‌ 8న కృష్ణా జిల్లాలో 5 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అలీ కోసం హైదరాబాద్‌, ముంబయి, పుణె, షోలాపూర్‌, బీదర్‌లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ, కర్ణాటక పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. వందల సీసీ కెమెరాల పరిశీలన అనంతరం 45 రోజులు శ్రమించి పోలీసులు బాకర్‌ అలీని అరెస్టు చేశారు. నిందితుడిపై 118 కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో పీడీ యాక్ట్‌ నమోదు. 2015కు ముందే హైదరాబాద్‌లో వందకు పైగా చైన్‌ స్నాచింగ్స్‌కు పాల్పడ్డాడు. బాకర్‌ అలీని పట్టుకున్న పోలీసులకు డీజీపీ రివార్డ్‌లు ప్రకటించారు.

VIDEOS

logo