అంతరాష్ట్ర దొంగ అరెస్టు..బంగారం స్వాధీనం

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఇన్చార్జి ఏసీపీ నరేందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక బస్టాండ్ ఎదుట సోదాలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి చేతిలో నల్ల బ్యాగుతో కనిపించాడు. అతడిని పట్టుకొని విచారించగా తన పేరు షేక్ ఉస్మాన్ అలియాస్ సలీం, తనది జగిత్యాల జిల్లా మెట్పల్లి అని చెప్పాడు. బ్యాగ్‌ను సోదా చేయగా అందులో బంగారు ఆభరణాలు దొరికాయి.
గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని జగిత్యాల, రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిర్యాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. కాగా పట్టుబడిన ఉస్మాన్ గతంలో జైలు శిక్షను అనుభవించాడు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో 5 కేసులు, శ్రీరాంపూర్‌లో 3 కేసులు నమోదయ్యాయి. 240 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 16 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్