శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 23, 2020 , 13:49:57

న‌ల్ల‌గొండ జిల్లాలో అంత‌ర్ రాష్ర్ట దొంగ‌ల ముఠా అరెస్ట్‌

న‌ల్ల‌గొండ జిల్లాలో అంత‌ర్ రాష్ర్ట దొంగ‌ల ముఠా అరెస్ట్‌

న‌ల్ల‌గొండ : జిల్లాలో న‌లుగురు స‌భ్యుల అంత‌ర్ రాష్ర్ట దొంగ‌ల ముఠాను అరెస్టు చేసిన‌ట్లు న‌ల్ల‌గొండ ఎస్పీ రంగ‌నాథ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల్లో 26 దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ముఠాలోని స‌భ్యుల‌ను మ‌ద్దెల హ‌రికృష్ణ‌, దుర్గంపూడి అంజిరెడ్డి, సూర‌జ్, జానీ పాషాగా గుర్తించారు. ఈ న‌లుగురు వృద్ధుల‌ను టార్గెట్ చేసి దొంగ‌త‌నాలు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వ‌ద్ద నుంచి 900 తులాల బంగారం, రెండు బైక్‌లు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  న‌ల్ల‌గొండ జిల్లాలో 8, ఖ‌మ్మం జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 12 దొంగ‌త‌నాలు చేశారు. నిందితుల‌పై పీడీ యాక్ట్ న‌మోదు చేశామ‌ని చెప్పారు.  


తాజావార్తలు