శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 13:41:56

హైద‌రాబాద్‌లో అంత‌ర్ రాష్ర్ట‌ దొంగ‌ల ముఠా అరెస్ట్

హైద‌రాబాద్‌లో అంత‌ర్ రాష్ర్ట‌ దొంగ‌ల ముఠా అరెస్ట్

హైద‌రాబాద్ : న‌గ‌రంలో చోరీల‌కు పాల్ప‌డుతున్న అంత‌ర్ రాష్ర్ట దొంగ‌ల ముఠాను రాచ‌కొండ పోలీసులు అరెస్టు చేశారు. న‌లుగురు స‌భ్యుల ముఠా నుంచి 51 తులాల బంగారం, కిలోన్న‌ర వెండి, కారుతో పాటు ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 31.75 ల‌క్ష‌లు ఉంటుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. దొంగ‌ల ముఠాపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దొంగ‌ల‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo