మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 09:43:46

ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగ‌లు అరెస్ట్‌

ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగ‌లు అరెస్ట్‌

పుణె: మ‌హారాష్ట్ర‌లో అంతర్రాష్ట్ర దొంగ‌ల ముఠా గుట్టును పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌త కొంత‌కాలంగా ఈ ముఠా స‌భ్యులు పుణె జాతీయ ర‌హ‌దారిపై మాటువేసి గూడ్స్ లారీల‌ను దారి మ‌ళ్లించి దోపిడీల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవ‌ల దోపిడీలు పెరిగిపోవ‌డంతో పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిఘా వేసి ముఠాలోని ఏడుగురు స‌భ్యుల‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు లారీల‌ను స్వాధీనం చేసుకున్నారు.  

పుణె రూర‌ల్ ఎస్పీ సందీప్ పాటిల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ముఠా స‌భ్యులు హైవేపై వెళ్లే గూడ్స్ లారీల‌ను బైకుల‌పై వెంబ‌డించి అడ్డ‌గిస్తారు. అనంత‌రం డ్రైవ‌ర్ల‌పై దాడిచేసి దారిమ‌ళ్లిస్తారు. అనంత‌రం ఆ లారీల్లోని స‌రుకును ర‌హ‌స్య ప్ర‌దేశంలో అన్‌లోడ్ చేసి అక్ర‌మ మార్గంలో అమ్ముకుంటారు. గురువారం రాత్రి కూడా రూ.4 కోట్ల సిగ‌రెట్ల లోడుతో వెళ్తున్న లారీని దారి మ‌ళ్లించి తీసుకెళ్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితుల‌పై వివిధ పోలీస్‌స్టేష‌న్ల ప‌రిధిలో చాలా కేసులు ఉన్నాయ‌‌ని తెలిపారు.                                                                                                                     


logo