బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 24, 2020 , 13:13:57

మూసాపేట‌లో దారుణం.. న‌డిరోడ్డుపై అప్పుడే పుట్టిన శిశువు

మూసాపేట‌లో దారుణం.. న‌డిరోడ్డుపై అప్పుడే పుట్టిన శిశువు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని మూసాపేట‌లో దారుణం జ‌రిగింది. అప్పుడే పుట్టిన ఓ ప‌సికందును న‌డిరోడ్డుపై వ‌దిలేసి వెళ్లిపోయారు. బాలుడి ఏడుపు విన్న స్థానిక మ‌హిళ కుమారి అప్ర‌మత్త‌మైంది. బొడ్డు తాడుతో ఉన్న‌ ఆ ప‌సిబిడ్డ వ‌ద్ద‌కు కుమారి వెళ్లి చేరిదీసింది. అనంత‌రం చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. ఆ త‌ర్వాత శిశువును కూకట్‌ప‌ల్లి పోలీసుల‌కు కుమారి అప్ప‌గించింది. ప‌సిబిడ్డ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే బాబును ఆటోలో తీసుకొచ్చి అక్క‌డ వ‌దిలేసి వెళ్లిన‌ట్లు కుమారి చెబుతోంది. ఆటోలో ఓ యువ‌తి ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.