శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 11:26:51

కృష్ణా నది పుట్టి మునిగిన ఘటనలో.. రెండు శవాలు లభ్యం

కృష్ణా నది పుట్టి మునిగిన ఘటనలో.. రెండు శవాలు లభ్యం

వనపర్తి : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రెండు రోజుల క్రితం కృష్ణా నదిలో పుట్టి మునిగిన ప్రమాదంలో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా, జూరాల డ్యామ్ దగ్గర వరదల్లో ఈ రోజు రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇవి మొన్నటి ప్రమాదానికి గురైన వారి శవాలుగా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా యపలదిన్నే మండలం కుర్వపురం గ్రాముం నుంచి ప్రజలు నిత్యం సరుకులు కొనేందుకు రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవ్ పహాడ్ వస్తుంటారు. 

ఈ నెల 17న కృష్ణా నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పుట్టిలో ఉన్న 14మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో  10 మంది సురక్షితంగా బయటపడగా నలుగురి ఆచూకీ లభించలేదు. నదిలో గల్లంతైన నలుగురు మహిళలు, కర్ణాటక రాష్ట్రం పెద్దకురం గ్రామానికి చెందినవారు. ఈ నలుగురులో ఇద్దరి మృతదేహాలు ఈ రోజు తెల్లవారుజామున జూరాల ప్రాజెక్టులో బయటపడ్డాయి. రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఎడమ కాలువ వద్ద సుమలత, ప్రాజెక్ట్ గేట్ నెం. 1 వద్ద పార్వతమ్మ (నర్సమ్మ) మృతదేహాలు లభ్యమయ్యాయి.logo