మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 18, 2020 , 12:47:55

ఆ జిల్లాలో... ఒకేరోజు మూడు దారుణ హత్యలు....

ఆ జిల్లాలో... ఒకేరోజు మూడు దారుణ హత్యలు....

అమరావతి: అనంతపురం జిల్లాలో ఒకేరోజు మూడు హత్యలు జరగడం పై కలకలం రేగింది. ఆదివారం అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు పురుషులు , ఓ మహిళ ఉన్నారు. బుక్కరాయసముద్రం మండలానికి చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉన్నది.  శింగనమల మండల పరిధిలోని నాయనిపల్లి క్రాస్‌లో ఉన్న పొలాల వద్ద ఓ మహిళను దుండగులు హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.

మృతురాలు పెద్దపప్పూరు మండలం నరసాపురానికి చెందిన నరసమ్మగా పోలీసులు గుర్తించారు.  నల్లమాడ మండలం రెడ్డికుంట తండాల్లోని బుక్కా కాసేనాయక్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తండా సమీపంలోని వంకలో బండరాయితో మోది హత్య చేశారు. జిల్లాలో ఒకేరోజున ముగ్గురు హత్యకు గురికావడం ప్రజల్లో తీవ్ర భయాందోళను రేకెత్తించింది. ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.