e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News మంచిర్యాల జిల్లాలో రూ. 51 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

మంచిర్యాల జిల్లాలో రూ. 51 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

మంచిర్యాల జిల్లాలో రూ. 51 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

మంచిర్యాల : జిల్లాలో నకిలీ విత్తన దందా గుట్టురట్టయ్యింది. అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా జిల్లాలకు తరలిస్తూ అమాయక రైతులకు అమ్ముతున్న బీటీ-3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్‌ వీ.సత్యనారాయణ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రామగుండం టాస్క్‌ఫోర్స్‌​‍, స్థానిక పోలీసులు, వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి రూ.51 లక్షల విలువైన 21 క్వింటాళ్ల బీటీ-3 నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.


నకిలీ విత్తనాల దందాకు పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, ఏసీపీ అఖిల్‌ మహాజన్‌, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, టాస్క్‌ఫోర్స్‌ ​‍ సీఐ ఏకే మహేందర్‌, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్‌, దేవయ్య, టాస్క్‌ఫోర్స్‌​‍ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

నల్లగొండ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

ఘరానా దొంగను అరెస్ట్‌ చేసిన కోరుట్ల పోలీసులు

బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి

రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంచిర్యాల జిల్లాలో రూ. 51 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత
మంచిర్యాల జిల్లాలో రూ. 51 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత
మంచిర్యాల జిల్లాలో రూ. 51 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

ట్రెండింగ్‌

Advertisement