ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 28, 2020 , 17:00:38

సెక్యూరిటీ గార్డును ఢీకొన్న బైక్‌.. తుపాకీ పేలి గాయాలతో మృతి

సెక్యూరిటీ గార్డును ఢీకొన్న బైక్‌.. తుపాకీ పేలి గాయాలతో మృతి

డెహ్రాడూన్‌: ఒక బ్యాంకు సెక్యూరిటీ గార్డు అనూహ్యంగా మరణించాడు. రోడ్డు దాడుతున్న ఆయనను బైక్‌ ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ గార్డు కింద పడగా అతడి చేతిలోని తుపాకీ పేలింది. కాలికి బులెట్ గాయం కాగా చికిత్స పొందుతూ చనిపోయిడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్‌కు చెందిన వీరేంద్ర రావత్ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం బ్యాంకు ముందు ఉన్న రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక బైక్‌ అతడ్ని ఢీకొట్టింది. దీంతో వీరేంద్ర రావత్‌ కింద పడ్డాడు. ఈ సందర్భంగా ఆయన చేతిలోని తుపాకీ పేలడంతో కాలికి గాయం అయ్యింది. రావత్‌ను వెంటనే దవాఖానకు తరలించారు. అయితే రక్తం ఎక్కువగా పోవడంతో చికిత్స పొందుతూ ఆ సాయంత్రం మరణించాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డును ఢీకొట్టిన బైక్‌ మీదున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.