మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 17:23:49

ఢిల్లీలో పెరిగిన నేరాలు : ఎన్‌సీఆర్‌బీ డేటా

ఢిల్లీలో పెరిగిన నేరాలు : ఎన్‌సీఆర్‌బీ డేటా

న్యూఢిల్లీ : గత ఏడాదిలో దేశ రాజధాని ఢిల్లీలో నేరాల శాతం పెరిగింది. 2018తో పోల్చితే 2019 లో 1,253 అత్యాచార కేసుల నమోదుతో 3 శాతం పెరుగుదల ఉన్నది. 2018 లో ఈ సంఖ్య 1,215 గా నమోదైందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎన్‌సీఆర్‌బీ.. భారత శిక్షాస్మృతి, దేశంలోని ప్రత్యేక, స్థానిక చట్టాల ద్వారా నిర్వచించబడిన నేర డేటాను సేకరించి విశ్లేషిస్తున్నది.

ఢిల్లీ నగరంలో 2019 లో వేధింపులు, లైంగికదాడుల కేసులు క్షీణించాయి. 2019 లో మొత్తం 2,811 కేసులు నమోదవగా.. 2018 లో 3,257 కేసులు వచ్చాయి. 2019 లో దేశ రాజధానిలో మొత్తం 2,99,475 నేరాలు నమోదయ్యాయని, 2018 తో పోలిస్తే 20 శాతం పెరుగుదల (2,49,012 కేసులు) ఉన్నట్లు డేటా చూపిస్తున్నది. ఏదేమైనా, ఘోరమైన నేరాల నమోదు తగ్గింది. నమోదైన మొత్తం నేరాలలో 80 శాతానికి పైగా దొంగతనాలు జరిగాయి. 2018 లో 1,95,688 చోరీ కేసులు నమోదు కాగా, 2019 లో 2,45,985 కు పెరిగింది. అదేవిధంగా, హత్యలు కూడా 2018 లో 513 కేసుల నుంచి 2019 లో 521 కేసులకు పెరిగాయి. అంతకుముందు సంవత్సరంలో జరిగిన దోపిడీ కేసులు 2,444 తో పోల్చితే.. 2019 లో 1,956 దోపిడీ కేసులు నమోదయ్యాయి. ఇది 20 శాతం తగ్గింది. దేశంలోనే అత్యధికం. అదేవిధంగా, సైబర్ క్రైం కేసులు 2018 లో 189 నుంచి 2019 లో 115 కు తగ్గాయి. ఇది సుమారు 35 శాతం తగ్గింది. ఆర్థిక నేరాలు 2018 లో 4,918 కేసులతో పోలిస్తే 2019 లో మొత్తం 4,889 నమోదయ్యాయి. ఇది స్వల్పంగా క్షీణించింది.


logo