లీ కాస్టెలెట్ (ఫ్రాన్స్): సూపర్ ఫామ్‌లో ఉన్న రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన రేసులో బ్రిటన్ స్టార్, మెర్సిడెజ్ రేసర్ హామిల్టన్‌ను వెనక్కి నెట్టిన వెర్స్టాపెన్ అగ్రస్థానంలో నిలిచాడు. నాటకీయంగా జరిగిన పోరులో లూయిస్ కంటే మ్యాక్స్ దాదాపు 3 సెకన్ల ముందే గమ్యాన్ని చేరాడు. కాగా రెడ్‌బుల్‌కే చెందిన పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో ఈ ఏడాది డ్రైవర్ చాంపియన్‌షిప్ పట్టికలో 12 పాయింట్ల ఆధిక్యంతో వెర్స్టాపెన్ టాప్‌లో కొనసాగుతున్నాడు.