శనివారం 31 అక్టోబర్ 2020
Crime - Sep 30, 2020 , 19:44:01

పశుగ్రాసానికి నిప్పంటించిన యువకుడికి జైలుశిక్ష

పశుగ్రాసానికి నిప్పంటించిన యువకుడికి జైలుశిక్ష

రంగారెడ్డి : పశుగ్రాసం(ఎండుగడ్డి)కు నిప్పంటించి రైతుకు నష్టం కలిగించినందుకు ఓ యువకుడికి 6నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000ల జరిమానా విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని యాచారం మండలంలోని మాల్‌కు అనుబంధంగా ఉన్న కిషన్‌పల్లి గ్రామానికి చెందిన మారయ్య కుమారుడు మధుకర్‌.. అదే గ్రామానికి చెందిన పాల వెంకటయ్యకు చెందిన పశుగ్రాసాన్ని గతంలో తగులబెట్టాడు.

దీంతో రైతు ఆర్థికంగా నష్ట పోయాడు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నం 26వ మొట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి తీర్పును వెల్లడించారు. రైతు పశుగ్రాసం తగులబెట్టి నష్టం చేకూర్చినందుకుగానూ మధుకర్‌కు 6 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000ల జరిమానా చెల్లించాలని తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.