శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 08:00:05

అక్రమంగా ముద్రించిన రూ.35 కోట్ల పుస్తకాలు సీజ్‌

అక్రమంగా ముద్రించిన రూ.35 కోట్ల పుస్తకాలు సీజ్‌

మీరట్‌ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా పార్తాపూర్‌లోని గోదాములో అక్రమంగా ముద్రించి నిల్వ చేసిన రూ.35 కోట్ల విలువైన ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలను స్పెషల్ టాస్క్‌ఫోర్స్, పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకుంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా వీటిని ముద్రించి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోదాముతోపాటు పుస్తకాలను, 6 ప్రింటింగ్ యంత్రాలను సీజ్‌ చేశామని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) అజయ్‌ సాహ్ని తెలిపారు. అక్రమ దందాకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సచిన్ గుప్తాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఆయన పేర్కొన్నారు. కొన్నాళ్లుగా గోదాములో గుట్టుచప్పుడు కాకుండా పుస్తకాలను ముద్రించి నిల్వ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో శుక్రవారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo