e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల అక్రమ దందా..ముఠా సభ్యుల అరెస్ట్‌

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల అక్రమ దందా..ముఠా సభ్యుల అరెస్ట్‌

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల అక్రమ దందా..ముఠా సభ్యుల అరెస్ట్‌

వరంగల్‌ అర్బన్‌ : కరోనా వ్యాప్తిని ఆసరా చేసుకుని రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను గురువారం వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‍ఫోర్స్​‍ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్‌ తరుణ్‌జోషి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.

కరోనా చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం తగినంత అందుబాటులో లేదు. దీంతో నగరంలోని లైఫ్‌లైన్‌ హాస్పిటల్‌లో ఫార్మసీ నిర్వహించే మండిబజార్‌కు చెందిన బాగాజీ మనోహర్‌, బీమారానికి చెందిన కొలిపాక కుమారస్వామి, కరీమాబాద్‌కు చెందిన ఐత అశోక్‌ హెటిరో కంపెనీ నుంచి ఒక్కొక్క ఇంజక్షన్‌ను రూ. 2,800కు కొనుగోలు చేశారు.


సాధారణంగా కరోనా వ్యాధి గ్రస్తులకు రూ. 3,490కు విక్రయించాల్సి ఉండగా, ఇంజక్షన్ల కొరతతో రూ 35,000 నుంచి 45,000 వరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‍ఫోర్స్​‍ సుబేదారి పోలీసుల సహకారంతో లైఫ్‌లైన్‌ దవాఖాన ఫార్మసీపై దాడులు చేశారు.

వారి వద్ద నుంచి 28 ఇంజక్షన్లతోపాటు రూ 20,000 నగదు స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి..

మైనర్‌ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

అంబులెన్స్‌లోనే కరోనా గర్భిణి ప్రసవం

సీఎం కేసీఆర్‌ వెంటే మంథని ప్రజలు

అజిత్ సింగ్ మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల అక్రమ దందా..ముఠా సభ్యుల అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement