బుధవారం 05 ఆగస్టు 2020
Crime - Jul 09, 2020 , 14:44:35

భార్య‌పై అనుమానం.. కానీ లోప‌ల ఉన్న‌ది ఆమె అక్క‌

భార్య‌పై అనుమానం.. కానీ లోప‌ల ఉన్న‌ది ఆమె అక్క‌

కృష్ణా : ఓ కానిస్టేబుల్ త‌న భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. ప్రియుడితో ఉన్న స‌మ‌యంలో రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాల‌నుకున్నాడు. కానీ భార్య స్థానంలో ఆమె అక్క‌ను చూసి షాక్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రంలో చోటు చేసుకుంది. 

మైల‌వ‌రంలో ప‌ని చేస్తున్న ఓ కానిస్టేబుల్ భార్య‌.. స్థానిక నాయ‌కుడితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లు స‌ద‌రు భ‌ర్త అనుమానం పెంచుకున్నాడు. పొందుగ‌ల రోడ్డులో ఉన్న నాయ‌కుడి ఇంటికి భార్య ర‌హ‌స్యంగా వెళ్లి క‌లుస్తున్న‌ట్లు కానిస్టేబుల్ భావించాడు. దీంతో భార్య‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాల‌నుకున్నాడు. 

ఈ క్ర‌మంలో నిఘా పెట్టిన కానిస్టేబుల్.. ఇద్ద‌రు వ్య‌క్తులు ఇంట్లో ఉన్న స‌మ‌యంలో నాయ‌కుడి ఇంటి గ‌డియ పెట్టాడు. ఇక పోలీసుల‌ను, మీడియాను అక్క‌డికి పిలిచాడు. తీరా గడియ తీసేస‌రికి.. లోప‌ల్నుంచి భార్య స్థానంలో ఆమె అక్క వ‌చ్చింది. దీంతో అంద‌రూ షాక్ కు గుర‌య్యారు. కానిస్టేబుల్ ని భార్య సోద‌రి బూతులు తిడుతూ వెళ్లిపోయింది. 

ఈ సంద‌ర్భంగా కానిస్టేబుల్ మాట్లాడుతూ.. ఉద్యోగ‌రీత్యా త‌న తోడ‌ల్లుడు ఊరిలో ఉండ‌క‌పోవ‌డంతో.. త‌న‌తో పాటు తోడ‌ల్లుడి కాపురంలో స్థానిక నాయ‌కుడు చిచ్చు పెట్టాడ‌ని ఆరోపించాడు. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి కేసు న‌మోదు కాలేదు.


logo