శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 16:15:41

అక్రమంగా మద్యం తరలింపు..ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

అక్రమంగా మద్యం తరలింపు..ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

సూర్యాపేట  : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమార్గంలో పయనించారు. అక్రమాల్ని అరికట్టాల్సిందే పోయి అక్రమార్కులతోనే చేతులు కలిపి వేటుకు గురయ్యారు ఆ పోలీసులు. జిల్లాలోని చింతలపాలెం మండలం స్థానిక పోలీస్ స్టేషన్ లో బయటపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్ల  మద్యం నిర్వాకం బట్టయలైంది. అక్రమ మద్యం తరలింపులో చేతులు కలిపిన విషయమై ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

వివరాల్లోకి వెళ్తే..  ఆంద్రప్రదేశ్ కి అక్రమంగా మద్యం రవాణా చేసే ముఠాతో ఇద్దరు కానిస్టేబుళ్లు కుమ్మక్కయ్యారు. వీరి అక్రమాలను ఏపీ పోలీసులు గుర్తించారు. అక్రమంగా మద్యం దందా చేస్తున్నారని ఏపీ పోలీసులు ఫిర్యాధు చేశారు. దీంతో చింతలపాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు సతీష్, జానకిరాములును సస్పెండ్ చేస్తూ జిల్లా ఏస్పీ భాస్కరన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్  తెలిపారు.


 


 


 logo