గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 10:03:28

యూపీలో రూ.1.5 కోట్ల విలువైన నకిలీ మందులు సీజ్‌

యూపీలో రూ.1.5 కోట్ల విలువైన నకిలీ మందులు సీజ్‌

ప్రయాగ్‌రాజ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌ జిల్లాలో భారీగా అక్రమ, నకిలీ మందులను ఆదివారం పోలీసులు సీజ్‌ చేశారు. ప్రయాగ్‌రాజ్‌ జిల్లా కేంద్రంలోని మోదీ అతిథి గృహం ఎదుట ఉన్న భవనంలో నకిలీ మందులు నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మోస్టువాటెంట్‌ నేరస్తుడు అనుపమ్‌ గోస్వామిని పట్టుకొని అతడిచ్చిన సమాచారం మేరకు నకిలీ మందుల దందాను నడుపుతున్న గోస్వామి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రెండు గిడ్డంగుల్లో నిల్వ చేసిన రూ.1.5 కోట్ల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌ లాల్‌ గుప్తా తెలిపారు. నిందితులపై మందుల నియంత్రణ చట్టం, మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo