ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 20:52:03

మహిళతో వివాహేతర సంబంధం.. హత్య

మహిళతో వివాహేతర సంబంధం.. హత్య

న్యూ ఢిల్లీ : ఓ వ్యక్తి మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరికి హత్యకు దారితీసింది. ఢిల్లీలోని మధువిహార్ ప్రాంతంలో 43 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలు.. నగరానికి చెందిన కల్లు అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ పశ్చిమ వినోద్ నగర్‌లో ఓ మహిళతో నివాసం ఉంటున్నాడు. ఆ మహిళతో కల్లుకు మూడు నెలలుగా వివాహేతర సంబంధం ఉండగా వారిద్దరు కొంతకాలంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మధువిహార్‌లో కల్లు పదునైన ఆయుధంతో మహిళ తలపై బలంగా కొట్టి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాస్మీత్ సింగ్ తెలిపారు. కల్లు పరారీలో ఉండగా అతడికి ఇదివరకే వేరే మహిళతో వివాహమై పిల్లలున్నట్లు జాస్మీత్‌ పేర్కొన్నారు. కల్లు ఆచూకీ లభిస్తే హత్యకు గల కారణాలు తెలుస్తాయని డీఐజీ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo