మంగళవారం 02 జూన్ 2020
Crime - Mar 08, 2020 , 07:01:05

ఐఐటీలో చదివాడు.. సైబర్‌ మోసగాడికి సమర్పించుకున్నాడు

ఐఐటీలో చదివాడు.. సైబర్‌ మోసగాడికి సమర్పించుకున్నాడు

హైదరాబాద్ : ఐఐటీలో చదివాడు.. మంచి వ్యాపారం చేస్తున్నాడు.. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి (సైబర్‌ క్రిమినల్‌) ప్రతి నెలా 15 శాతం లాభాలు ఇస్తాననగానే నమ్మి రూ.25లక్షలు ఇచ్చాడు... అయితే సైబర్‌ క్రిమినల్‌ రూ.5లక్షలు వ్యాపారికి రిటన్‌ ఇచ్చి.. రూ.20 లక్షలతో ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన ఓ వ్యా పారికి వాట్సాప్‌ (+447913661959)లో.. తాను లండన్‌ నుంచి మాట్లాడుతు న్నాంటూ గుర్తుతెలియని వ్యక్తి  మాట్లాడాడు. ఇతను.. అంతకు ముందు వ్యాపారి స్నే హితుడితో కూడా చాటింగ్‌  చేశాడు. తాము స్టాక్స్‌, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పె డుతామని, మా వద్ద పెట్టుబడులు పెడితే నెలవారీగా లాభనష్టాలతో నిమిత్తం లేకుండా 15 శాతం లాభాలు ఇస్తానంటూ ట్రాప్‌ చేశాడు. మొదటగా బాధితు డి స్నేహితుడు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు.. కొన్ని రోజులు ఎదురు చూసి మోసపో యానని గుర్తించి.. ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. ఇంతలోనే వ్యాపారిని ఆ గుర్తుతెలియని వ్యక్తి సంప్రదించాడు. లక్ష, రెండు లక్షలతో ఎలాంటి లాభాలు కన్పిం చవని, కనీసం రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే నెలవారీగా భారీ లాభాలు వస్తాయం టూ నమ్మించాడు. అతని ట్రాప్‌లో చిక్కుకున్న వ్యాపారి.. రెండు మూడు దఫాలుగా రూ. 25 లక్షలు డిపా జిట్‌ చేశాడు. అందులో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చేసి.. రూ. 20 లక్షలతో ఉడాయించాడు. సెల్‌ఫోన్‌లో సంప్రదిస్తే ఎలాంటి స్పందన లేకపోవడంతో... మోసపోయానని గుర్తించిన వ్యాపారి శనివారం సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు.


logo