గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 27, 2020 , 20:08:09

వేగ‌వంత‌మైన రైలు టికెట్ బుకింగ్ యాప్ రూప‌క‌ల్ప‌న‌‌.. ఐఐటీ గ్రాడ్యుయేట్ అరెస్టు

వేగ‌వంత‌మైన రైలు టికెట్ బుకింగ్ యాప్ రూప‌క‌ల్ప‌న‌‌.. ఐఐటీ గ్రాడ్యుయేట్ అరెస్టు

చెన్నై : ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ బుకింగ్ ఎంత ప్ర‌హ‌స‌నమో తెలిసిందే. గ‌త కొన్నేండ్లుగా వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ మెరుగుప‌డుతూ వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆన్‌లైన్ రైల్ టికెట్ బుకింగ్ హోస్ట్ మాత్రం ఇంకా అక్క‌డే ఉంద‌న్న‌ వాస్తవం చాలా మందికి అనుభ‌వ‌మే. బ‌హుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే కావ‌చ్చు ఓ ఐఐటియ‌న్ అండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల కొర‌కు వేగ‌వంత‌మైన‌ రైలు టికెట్ బుకింగ్‌ యాప్స్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు. అయితే ఈ ఆలోచ‌నే అత‌డిని జైలులో ఉంచింది. తిరుపూర్‌కు చెందిన ఎస్‌. యువ‌రాజా ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో విద్య‌న‌భ్య‌సించాడు. ఇత‌డు సూప‌ర్ త‌త్కాల్‌, సూప‌ర్ త‌త్కాల్ ప్రొ అనే రైల్వే టికెట్ బుకింగ్ యాప్స్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు.

వినియోగ‌దారులు టికెట్ల‌ను బుక్ చేసుకునేందుకు కాయిన్ ఆధారిత వ్యవస్థ ద్వారా చెల్లింపులకు బదులుగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడం ద్వారా ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ వ్యవస్థను మ‌ళ్లించిన‌ట్లుగా ఇత‌డిపై ఆరోప‌ణ‌లు. యువ‌రాజా 2016లోనే వీటిని సృష్టించిన‌ట్లుగా స‌మాచారం. అయితే అప్ప‌టినుండి ఇవి గూగుల్ ప్లే స్టోర్ నుండి తొల‌గించ‌బ‌డ్డాయి. అదేవిధంగా డౌన్‌లోడ్‌కు కూడా అందుబాటులో లేవు. సర్వర్ సోర్స్ కోడ్, అప్లికేషన్ సోర్స్ కోడ్, యూజర్స్ జాబితా, అతని బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఉపయోగించి చెన్నైలోని సైబర్ సెల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) యువ‌రాజాను ట్రాక్ చేసి అరెస్టు చేసింది.

తాజావార్తలు