ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 14:35:44

రోడ్డు కల్వర్టర్ కింద బాంబు.. నిర్వీర్యం చేసిన స్క్వాడ్

రోడ్డు కల్వర్టర్ కింద బాంబు.. నిర్వీర్యం చేసిన స్క్వాడ్

శ్రీనగర్: ఒక రోడ్డు కల్వర్టర్ కింద బాంబును గుర్తించిన ఆర్మీ బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ దానిని సురక్షితంగా నిర్వీర్యం చేసింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నట్నుస్సా సమీపంలోని రోడ్డు కల్వర్టర్ కింద ఐఈడీ ఉన్నట్లు సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. దీంతో బాంబు తొలగింపు బృందం రంగంలోకి దిగి దానిని నిర్వీర్యం చేసినట్లు ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. ఈ ఆపరేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా ఆ రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు సైనిక అధికారులు తెలిపారు. ఐఈడీని తొలగించిన అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పారు. రోడ్డుపై వెళ్లే సైనిక వాహనాలను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కల్వర్టర్ కింద ఐఈడీని అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo