బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 18:20:23

ఎయిర్‌ఫోర్స్ అధికారి ఆత్మ‌హ‌త్య

ఎయిర్‌ఫోర్స్ అధికారి ఆత్మ‌హ‌త్య

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో దారుణం జ‌రిగింది. వైమానిక ద‌ళానికి చెందిన ఇంద‌ర్‌పాల్ సింగ్ అనే వారెంట్ ఆఫీస‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. జ‌మ్ములోని వైమానిక ద‌ళం శిబిరంలో ఇంద‌ర్‌పాల్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. త‌న స‌ర్వీస్ పిస్త‌ల్‌తో త‌ల‌పై కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. అయితే ఇంద‌ర్‌పాల్‌ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ద‌ని అధికారులు తెలిపారు. 53 ఏండ్ల ఇంద‌ర్‌పాల్ సింగ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌వాడ‌ని చెప్పారు. 

ఇంద‌ర్‌పాల్ పిస్త‌ల్‌తో కాల్చుకున్న వెంట‌నే స‌హ‌చ‌రులు ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని, అయితే అప్ప‌టికే అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించార‌ని పోలీసులు చెప్పారు. పోస్ట్‌మార్టం పూర్త‌యిన వెంట‌నే ఇంద‌ర్‌పాల్ భౌతిక కాయాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించిన‌ట్లు తెలిపారు. కాగా ఈ నెల జ‌మ్ము రీజియ‌న్‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన రెండో వైమానికద‌ళ ఉద్యోగి ఇంద‌ర్‌పాల్. ఆగ‌స్టు 8న కూడా ఉధంపూర్‌లో వైమానిక ద‌ళానికి చెందిన ఓ జ‌వాన్ త‌న స‌ర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo