సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 31, 2020 , 15:43:57

‘నన్ను 139 మంది రేప్‌ చేయలేదు.. వాడు చెప్పమంటేనే ప్రదీప్‌ పేరు చెప్పా!’

‘నన్ను 139 మంది రేప్‌ చేయలేదు.. వాడు చెప్పమంటేనే ప్రదీప్‌ పేరు చెప్పా!’

తనపై ఏకంగా 139 మంది సుమారు 5000 సార్లు లైంగికదాడికి పాల్పడ్డారని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ 30 ఏండ్ల దళిత యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ర్టం మొత్తం సంచలనం సృష్టించగా.. ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యాంకర్‌ ప్రదీప్‌, నటుడు కృష్ణుడు పేర్లు కూడా ఉండటం సినీ ఫీల్డ్‌లో చర్చకు దారి తీసింది. 

ఒక్కొక్కరు నెలల తరబడి తనను వాడుకున్నారని, సామూహికంగా లైంగికదాడికి పాల్పడి, సిగరెట్లతో కాల్చారని, నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేశారని, గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేసి చిత్రహింసలకు గురిచేశారని ఇచ్చిన ఫిర్యాదుపై 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి..  పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తరువాత సదరు యువతి మాట మార్చింది.  ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కి గానీ, నటుడు కృష్ణుడికి గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

బాధితురాలు ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ డాలర్ బాయ్ అనే వ్యక్తి చెప్పమనడంతోనే తాను 139 మంది పేర్లతో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇందులో చాలా మందికి సంబంధం లేదని, 139 మంది నన్ను రేప్‌ చేయలేదని తాను చెబుతున్నా వినకుండా డాలర్‌బాయ్‌ టార్చర్‌ పెట్టి, చంపేస్తానని బెదిరించి తనతో ఈ కంప్లెంట్‌ పెట్టించాడని యువతి పేర్కొన్నది. ఈ కేసుతో సంబంధం లేని వాళ్లందరికీ క్షమాపణలు కోరుతున్నాని చెప్పింది. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు, నటుడు కృష్ణుడు పేరు చెప్పానని తెలిపింది. వారి నుంచి డబ్బులు గుంజడానికే డాలర్‌ బాయ్‌ ఈ కుట్ర పన్నినట్లు పేర్కొన్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo