గురువారం 04 జూన్ 2020
Crime - Feb 19, 2020 , 16:33:48

దివ్యను హత్య చేసింది నేనే..

దివ్యను హత్య చేసింది నేనే..

రాజన్న సిరిసిల్ల: మంగళవారం గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దివ్య(26) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, దివ్యను ఎవరు చంపారనే విషయంపై స్పష్టత లేక మిస్టరీగా మారింది. దివ్యను తానే హతమార్చానని వెంకటేష్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఇవాళ వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హంతకుడిని విచారించిన వేములవాడ పోలీసులు.. గజ్వేల్‌ పోలీసులకు అప్పగించారు.  వెంకటేష్‌ గౌడ్‌ను పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. కాగా, దివ్యను హత్య చేయడానికి గల కారణం.. తన ప్రేమ విఫలమవడమేనని అతను పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కాగా,  ఇదివరకే దివ్య తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న దివ్యను గొంతుకోసి దారుణంగా చంపి, వారి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశాడు ఆ ప్రేమోన్మాది.


logo