శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 12:53:42

చిరుత‌ను చంపి తిన్నారు.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు

చిరుత‌ను చంపి తిన్నారు.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు

ఇడుక్కి: కేర‌ళ‌లో ఐదుగురు క‌లిసి వ‌ల‌లో చిక్కిన చిరుత‌ను చంపేశారు. అనంత‌రం దాని మాంసం వండుకుని తిన్నారు. చిరుత చ‌ర్మం, గోర్లు, ప‌ళ్ల‌ను అమ్ముకునేందుకు దాచిపెట్టారు. అయితే, విష‌యం అటవీ అధికారుల‌కు చేర‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యారు. కేర‌ళ‌లోని ఇడుక్కి జిల్లా మంకులం ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. వినోద్ అనే వ్య‌క్తి అట‌వీ ప్రాంతానికి స‌మీపంలో ఉండే త‌న ఇంటి చుట్టూ అడ‌వి జంతువుల కోసం వ‌ల‌ ఏర్పాటు చేశాడు. ఈ నెల 20న ఆ వ‌ల‌లో చిరుత‌పులి చిక్కింది.

అయితే, వ‌ల‌లో చిరుత చిక్కిన‌ విష‌యాన్ని‌ అట‌వీ అధికారుల‌కు తెలియ‌జేయ‌కుండా త‌న ఇరుగుపొరుగు వారైన కురియ‌కోస్‌, బిను, కుంజ‌ప్ప‌న్‌, విన్సెంట్‌ల‌తో క‌లిసి వినోద్ దాన్ని చంపేశాడు. అనంత‌రం చిరుత‌ తిత్తి తీసి మాంసం వండుకు తిన్నారు. పైగా అమ్ముకుంటే డ‌బ్బులు వ‌స్తాయ‌న్న ఆశ‌తో చిరుత చ‌ర్మాన్ని, గోర్ల‌ను, ప‌ళ్ల‌ను దాటిపెట్టారు. అయితే, ఇంత‌లో విష‌యం అటవీ అధికారుల‌కు చేర‌డంతో వారు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని నిందితుల‌ను రెండ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. నిందితులు వండుకున్న తిన్న చిరుత వ‌య‌సు 6-7 ఏండ్లు ఉంటుంద‌ని అట‌వీ అధికారులు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo