బుధవారం 03 జూన్ 2020
Crime - Mar 31, 2020 , 18:17:58

వైన్‌షాపులు ఓపెన్‌ అంటూ నకిలీ జీవో.. వ్యక్తి అరెస్ట్‌

వైన్‌షాపులు ఓపెన్‌ అంటూ నకిలీ జీవో.. వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణలో వైన్‌షాపులు ఓపెన్‌ చేస్తున్నారంటూ నకిలీ జీవో సృష్టించిన  వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఉప్పల్‌ విజయపురి కాలనీకి చెందిన  వ్యక్తిగా గుర్తించారు.  తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫేక్‌న్యూస్‌ షేర్‌ చేసిన వారిని పోలీసులు హెచ్చరించారు. 

కొన్ని రోజుల క్రితం  మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల పేరిట విడుదలైన జీవో అంటూ సోషల్‌ మీడియాలో   వైరల్‌  కావడంతో ఎక్సైజ్‌ డీఎస్పీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జీవో కాపీని పోలిన నకిలీ కాపీని తయారు చేసి వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైన్‌షాపులు, కల్లు దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. 


logo