సోమవారం 13 జూలై 2020
Crime - Apr 14, 2020 , 16:12:25

మద్యం పంచారు..జైలుకు వెళ్లారు: వీడియో

మద్యం పంచారు..జైలుకు వెళ్లారు: వీడియో

హైదరాబాద్‌: నగరంలోని ఈదీ బజార్‌కు చెందిన సంజూ కుమార్‌ తన స్నేహితుడైన నితీశ్‌ కుమార్‌తో కలిసి కొద్ది రోజుల క్రితం తమ వద్ద ఉన్న మద్యాన్ని చంపాపేటలోని కొంత మంది మద్యం ప్రియులకు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేసిన ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ మహ్మద్‌ ఖురేషీ తెలిపారు.  మద్యం పంపిణీ చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ పోస్ట్‌ చేయగా అవి కాస్త వైరల్‌ కావడంతో ఆబ్కారీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

నగరానికి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు సంజూ, నితీశ్‌.. జలంధర్‌లో ఒక వ్యక్తిలా మద్యం పంచి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకున్నారు. దీనిలో భాగంగానే వైన్‌ షాపులు, కల్లు దుకాణాల దగ్గరకు వెళ్లి కొంతమంది మందు ప్రియులకు పరిమిత మోతాదులో మద్యం పంచారు. టిక్‌టాక్‌ తదితర సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావాలనే ఉద్దేశంతో వాటిని వైరల్‌ చేశారు. ఐతే ఓ నెటిజన్‌ ఈ విషయాన్ని పీఐబీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన పీఐబీ రాష్ట్ర అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు  మద్యం పంపిణీ చేసిన సంజు, నితిశ్‌లను అరెస్ట్‌ చేశారు. logo