శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 25, 2020 , 21:22:07

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత...

హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ లోకస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్జాతీయ, ఇద్దరు దేశీయ ప్రయాణికుల నుంచి రూ. 70.95 లక్షల విలువైన గోల్డ్ బిస్కెట్లను సీజ్ చేసినట్లు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. విదేశీ మార్క్ ఉన్న బంగారు బిస్కెట్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సీజ్ చేసిన బంగారు బిస్కెట్లు 1.38 కిలోల బరువు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు విమానంలో దుబాయ్ నుంచి విశాఖపట్నం, ఆపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారని వారు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.