ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 20, 2020 , 13:12:57

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం నాగుపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త వ్యక్తి మృతి చెందగా.. భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడిని హైదరాబాద్‌ సైనిక్‌పురికి చెందిన ప్రభాకర్‌ (40)గా గుర్తించారు. భార్యభర్తలిద్దరు ద్విచక్ర వాహనంపై పోతాన్‌శెట్టిపల్లి గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో తూప్రాన్‌ మండలం నాగులపల్లి శివారు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలు కాగా.. హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo