గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 17, 2020 , 10:56:42

గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త

గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త

సంగారెడ్డి : జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానమే పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే కత్తితో గొంతు కోసి అమానవీయంగా హత్య చేసిన విషాద ఘటన జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని కాసింపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..శంకర్ అనే వ్యక్తి తన భార్య పుణ్యవతి (30) వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేశారని పోలీసులు వివరించారు. కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గత ఆరు నెలల క్రితం భార్యాభర్తలు కుల పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుని దూరంగా ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం పుణ్యవతి తల్లి గారి ఇంటి నుంచి కాసిం పూర్ చేరుకుంది. మంగళవారం రాత్రి గ్రామంలోని తన ఇంటి వద్ద భార్యతో శంకర్ గొడవ పడ్డాడు. కోపంతో భార్య గొంతు కోసి హత్య చేశాడని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది.logo