గురువారం 26 నవంబర్ 2020
Crime - Oct 20, 2020 , 16:18:10

భార్య‌ను చంపేందుకు భ‌ర్త సుపారీ

భార్య‌ను చంపేందుకు భ‌ర్త సుపారీ

భద్రాద్రి కొత్తగూడెం : భార్య‌ను చంపేందుకు ఓ భ‌ర్త కుట్ర ప‌న్నాడు. త‌న‌ను హ‌త‌మార్చేందుకు సుపారీ సైతం ఇచ్చాడు. కుట్ర‌ను ప‌సిగ‌ట్టిన పోలీసులు చాక‌చ‌క్యంగా నిందితుల‌ను ప‌ట్టుకుని అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుండి క‌త్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. గోదావ‌రిఖ‌నికి చెందిన అశోక్‌, ఇల్లందు కోర్టులో అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యుట‌ర్‌గా ప‌నిచేసే ర‌జిత ఇరువురు దంప‌తులు. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో ఇరువురు వేర్వేరుగా జీవిస్తున్నారు. కాగా భార్య మీద ప‌గ‌తో ర‌గిలిపోతున్న అశోక్ ఆమెను ఎలాగైనా అంత‌మొందించాల‌ని ప్లాన్ వేశాడు. ఈ క్ర‌మంలో భాగంగానే ఖ‌మ్మం జిల్లా నెల‌కొండ‌ప‌ల్లికి చెందిన భూక్య వీర‌బాబు, కొత్తూరి ప్ర‌సాద్ అనే ఇద్ద‌రికి సుపారీ ఇచ్చాడు. మొద‌ట‌గా రూ. 3 ల‌క్ష‌లు అంద‌జేసి భార్య ర‌జిత‌ను క‌డ‌తేర్చాల్సిందిగా చెప్పాడు. కుట్ర‌ను ప‌సిగట్టిన ఇల్లందు సీఐ ర‌మేశ్ త‌న సిబ్బందితో క‌లిసి నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.