ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 16, 2020 , 13:51:51

భార్య తల నరికి చంపిన భర్తకు రిమాండ్

భార్య తల నరికి చంపిన భర్తకు రిమాండ్

సంగారెడ్డి : భార్యపై అనుమానంతో తల నరికి చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ సత్యనారాయణ రాజు హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని నారాయణ ఖేడ్ మండలం అనంతసాగర్‌లో భార్య అనుసూయను భర్త సాయిలు ముందుగా తలపై కర్రతో కొట్టి తర్వాత కత్తితో తల నరికినట్లు తెలిపారు. తలను తన స్కూటీపై నారాయణఖేడ్‌కు తెచ్చి జైపాల్ రెడ్డి ఇంటి వద్ద ఉంచాడు.

భార్య హత్యకు నెల రోజుల క్రితమే పథకం వేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పదేండ్ల క్రితం అత్తను చంపిన కేసులో సాయిలు 15 నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. నిందితుడి స్కూటీ, సెల్ ఫోన్ సహా హత్యకు ఉపయోగించిన కత్తి, కట్టెను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.