అనుమానంతో భర్త దాష్టీకం.. భార్యను కాల్గర్ల్గా చిత్రీకరించిన వైనం

తిరుపతి : పెళ్లయిన నాలుగు నెలలకే భార్య పట్ల భర్త దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆమెపై అనుమానంతో ఇద్దరు పడక గదిలో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పలు కాలేజీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి కాల్గర్ల్గా చిత్రీకరించాడు. చిత్తూరు జిల్లా తిమ్మినాయుడు పాలేనికి చెందిన రేవంత్ కుమార్ టీటీడీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న పలమనేరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన రెండు నెలల నుంచే ఆమెకు భర్త రేవంత్ కుమార్ నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. తరచూ అనుమానిస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
భార్య ఇంట్లోనే ఉన్నా నగదు, నగలతో ఆమె మరొకరితో వెళ్లిపోయినట్లు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భర్త ప్రవర్తపై విసుగెత్తి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరింత రగిలిపోయిన రేవంత్ భార్యతో పడక గదిలో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి కాల్గర్ల్గా చిత్రీకరించాడు. విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న భార్య బుధవారం భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తను అవమానించిన భర్త రేవంత్కుమార్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ