గురువారం 28 జనవరి 2021
Crime - Sep 17, 2020 , 21:35:16

భార్యను కడతేర్చిన భర్త

  భార్యను కడతేర్చిన భర్త

పెద్దపల్లిరూరల్‌: కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేసిన ఘటన పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో గురువారం జరిగింది. పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమార్‌, గ్రామస్తుల కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన కందుల పర్వతాలు, కనుకలక్ష్మి భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు. ఇద్దరు వివాహాలు చేసుకొని వేరు ఉంటుండగా, మరో ఇద్దరు వీరితోనే ఉంటున్నారు. అయితే పర్వతాలు సింగరేణి ఉద్యోగం చేసి పన్నెండేళ్ల క్రితమే పదవీ విరమణ పొంది, హన్మంతునిపేటలోని తన భార్యతో కలిసి ఉంటున్నాడు. 

కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. కొడుకులు సైతం వేర్వేరుగా గదుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సైకోలా ప్రవరిస్తున్న పర్వతాలు బుధవారం అర్ధరాత్రి తన భార్య కనుకలక్ష్మి(60) నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై మోదాడు. వృద్ధురాలు అక్కడిక్కడే చనిపోయింది. మృతురాలి సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.logo