శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 06, 2020 , 12:21:33

ఆ సంబంధం ఉంద‌ని రాసివ్వు.. కోడ‌లికి వేధింపులు

ఆ సంబంధం ఉంద‌ని రాసివ్వు.. కోడ‌లికి వేధింపులు

అహ్మ‌దాబాద్ : మ‌రొక‌రితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లు రాసివ్వ‌మ‌ని అత్త‌మామ‌లు ఓ కోడ‌లిని వేధించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని బాపున‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. భూపేష్, కిర‌ణ్ అర్ద్వి(33) దంప‌తుల‌కు 14 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి 14, 10 ఏళ్ల వ‌య‌సున్న బాబు, అమ్మాయి ఉన్నారు. గ‌తేడాది మార్చి నెల‌లో కిర‌ణ్‌ను భూపేష్ కొట్ట‌డంతో.. ఆమె త‌న పాప‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అబ్బాయి మాత్రం తండ్రితోనే ఉంటున్నాడు. ఇటీవ‌లి కాలంలో కిర‌ణ్‌ను అత్త‌మామ‌లు వేధించ‌డం మొద‌లుపెట్టారు. త‌న‌కు మ‌రొక‌రితో వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్లు రాసివ్వాల‌ని అత్త‌మామ‌లు డిమాండ్ చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు కిర‌ణ్ ఫిర్యాదు చేసింది. భూపేష్‌కు మ‌రొక మ‌హిళ‌తో పెళ్లి చేస్తామ‌ని చెప్పిన‌ట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గ‌తంలో త‌న బిడ్డ‌ను కూడా చంపేందుకు భూపేష్ య‌త్నించాడ‌ని తెలిపింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo