బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 12:56:47

భార్య బారి నుంచి కాపాడాల‌ని భ‌ర్త ఫిర్యాదు!

భార్య బారి నుంచి కాపాడాల‌ని భ‌ర్త ఫిర్యాదు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం కోల్‌క‌తా న‌గ‌రంలో వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్య పెట్టే చిత్ర‌హింస‌ల నుంచి త‌న‌ను కాపాడాలంటూ ఓ వ్య‌క్తి  స్థానిక కోర్టుకు మొర‌పెట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన జ్యోతిర్మయి మజుందార్ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అత‌ను న‌గ‌రంలోనే తల్లి, తండ్రి, భార్యతో కలిసి నివ‌సిస్తున్నాడు. అయితే, కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రారంభంలో తల్లిదండ్రులను సొంత గ్రామమైన బైద్యబతిలో వదిలి వచ్చాడు. 

అయినా క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇస్తూ వ‌చ్చింది. దీంతో మ‌జుందార్‌ ఇటీవల స్వ‌గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులను కోల్‌కతాకు తీసుకొచ్చాడు. అయితే వారిని తీసుకురావడం భార్యకు ఇష్టంలేదు. వారివల్ల కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, అందుకే ఇంటికి తీసుకురావొద్దని భర్తను హెచ్చరించింది. అయినా వారిని ఇంటికి తీసుకురావడంతో ఆ రోజు నుంచి భర్తను చిత్రవ‌ధ చేయ‌డం మొద‌లుపెట్టింది. 

ప్ర‌తి రోజు చెంపదెబ్బలు కొట్టడం, పిన్నులతో గుచ్చడం, సిగరెట్ల‌తో కాల్చడం చేసేది. భార్య చిత్రహింసలు భరించలేక చివరకు జ్యోతిర్మయి మజుందార్ భీదాన్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చిత్రహింసలు పెడుతున్న‌ద‌ని ఫిర్యాదు చేశాడు. భార్యపెట్టే చిత్రహింసను వీడియో రికార్డుచేసి పోలీసులకు చూపించాడు. అయితే పోలీసులు కంప్లెయింట్ రాసుకుని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోల్‌క‌తా హైకోర్టును ఆశ్ర‌యించాడు. 


logo