శనివారం 16 జనవరి 2021
Crime - Oct 15, 2020 , 13:46:17

విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి

విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి

ఖమ్మం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం బోదులబండలో చెరుకు తోటలో జడలు వేస్తుండగా తెగిన విద్యుత్ వైరు తగిలి తెలగమళ్ల ఆనందరావు, తెలగమళ్ల పార్వతి భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..వర్షం తగ్గటంతో చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించేందుకు కూలీలను కూడా పెట్టాలని నిర్ణయించారు. దీంతో ముందుగా వారు పొలానికి చేరుకొని చెరుకు తోటలో జడలు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.