శనివారం 23 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 21:11:59

నర్సింగ్‌ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి

నర్సింగ్‌ విద్యార్థిని కుటుంబానికి  న్యాయం చేయాలి

గువాహతి: బెంగళూరులో లైంగికదాడి, హత్యకు గురైన 19 ఏండ్ల నర్సింగ్ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె స్వస్థలమైన అసోం బార్పేట జిల్లాలోని హౌలీ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో పాటు వందలాది మంది క్యాండిల్ లైట్ మార్చ్ చేపట్టారు. హౌలీ పట్టణంలో విద్యార్థి అంత్యక్రియలు జరిపిన తరువాత ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాలు, స్థానికులు భారీ క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు.

ఈ నెల16 న బెంగళూరులో నర్సింగ్ విద్యార్థిని లైంగికదాడి అనంతరం దారుణ హత్యకు గురైంది. మృతురాలు ఇటీవలనే నర్సింగ్ కోర్సు కోసం బెంగళూరులోని ఒక కళాశాలలో చేరింది. అసోంలోని గోల్‌పారా జిల్లాకు చెందిన అనిసూర్ రెహ్మాన్ అనే యువకుడి సహాయంతో ఆమె నర్సింగ్‌ కోర్సులో చేరినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే అనిసూర్ రెహ్మాన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా బైదరహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo