గురువారం 28 జనవరి 2021
Crime - Nov 07, 2020 , 19:13:28

వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత.. డీలర్‌ అరెస్టు

వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత.. డీలర్‌ అరెస్టు

మహబూబాబాద్‌ : రేషన్‌ బియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు యత్నించిన రేషన్‌ డీలర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌బాబు తన సిబ్బందితో కలిసి బోడగుట్ట తండాలోని రేషన్‌ డీలర్‌ బానోతు థల్‌ సింగ్‌(48) ఇంటిపై రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. పేదలకు అందజేసే బియ్యంలో కొంత అక్రమంగా మిగుల్చుకుని వాటిని బయట ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో భాగంగా బియ్యాన్ని గూడూర్‌కు చెందిన ఎస్‌కే అనిఫ్‌కు అమ్మేందుకు యత్నించాడు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.


logo