ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 04, 2020 , 21:50:37

హుండీలు కొల్లగొడుతున్న గ్యాంగ్ అరెెస్టు

 హుండీలు కొల్లగొడుతున్న గ్యాంగ్ అరెెస్టు

అమరావతి : తూర్పుగోదావరి జిల్లా కోనసీమలేని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయ్యాల్లో హుండీలను కొల్లగొట్టిన ముఠాను ఇంద్రపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇంచార్జి క్రైమ్ డీఎస్పీ భీమారావు ఇంద్రపాలెం పోలీసులు కాకినాడ రూరల్ తూరంగి గ్రామానికి చెందిన మైలపల్లి కోదండం(22), జె. రామారావు పేటకు చెందిన కొవ్వూరి దుర్గాప్రసాద్ (19), ఉమ్మడి సతీష్ అలియాస్ పిచ్చుక గాడు (20), తిరుదు నవీన్ కాశీ(20), ముత్తా నగర్ కు చెందిన మైనర్ బాలుడు(18) ముఠాగా ఏర్పడి కోనసీమలోని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయాల్లో హుండీలను కొల్లగొట్టారు. అంతేకాదు కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్టేషన్ పరిధిలో రెండు బైక్ లను చోరీ చేశారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు రూ. 78,950లు నగదుతో పాటు రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  



logo