శనివారం 16 జనవరి 2021
Crime - Jan 06, 2021 , 19:43:24

తుల్జాభవాని ఆలయంలో హుండీ చోరీ..

తుల్జాభవాని ఆలయంలో హుండీ చోరీ..

సంగారెడ్డి : జిల్లాలోని మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో గల తుల్జాభవాని ఆలయంలో బుధవారం తెల్లావారుజమున గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం మేరకు.. తుల్జాభవాని ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఆలయంలోని ప్రధాన హుండీని దొంగలించినట్లు వారు తెలిపారు. ఏడాది క్రితం ఓ సారి ఇదే ఆలయంలో హుండీ ఆలయ సామగ్రి దొంగతనం జరిగినట్లు గుర్తు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మండలంలోని ఆయా గ్రామాల్లో గత కొంత కాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికి సంబంధిత అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నాట్లు మండల వాసులు వాపోతున్నారు.