మంగళవారం 07 జూలై 2020
Crime - Feb 03, 2020 , 06:34:47

మచ్చబొల్లారంలో 30 తులాల బంగారం, 2 లక్షలకు పైగా నగదు చోరీ..

 మచ్చబొల్లారంలో 30 తులాల బంగారం, 2 లక్షలకు పైగా నగదు చోరీ..

హైదరాబాద్ :  అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మచ్చబొల్లారం కృష్ణానగర్‌లో భారీ చోరీ జరిగింది.  ఇంటి యజమాని సమ్మక్క సారక్క జాతరకు వెళ్లివచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి 30 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి, 2 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మచ్చబొల్లారం కృష్ణానగర్‌కు చెందిన బాలయ్య రిటైర్ట్‌ ఉద్యోగి. ఇద్దరు కుమారులు ప్రవీణ్‌, శ్రీకాంత్‌లతో నివాసముంటున్నాడు. సమ్మక్క సారక్క జాతర కావడంతో బాలయ్య  కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 30న జాతరకు వెళ్లాడు.  జాతరను ముగించుకొని శనివారం రాత్రి  తిరిగి వచ్చేశారు. కుటుంబ సభ్యులతో సహా ఇంటికి చేరుకున్న బాలయ్య కుటుంబం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం, బెడ్‌రూంలో ఉన్న బీరువా తెరిచి ఉండడం,  బీరువాలో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ. 2 లక్షలకు పైగా నగదు కనిపించపోవడంతో అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  ఏసీపీ నరసింహారావు, సీఐ పులి యాదగిరి, ఎస్‌. వరప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని చోరీతీరును పరిశీలించారు. కేసు దర్యప్తు చేస్తున్నారు. 


logo