ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 13:42:13

భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం

భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం

గౌహతి: అసోంలో భారీగా తుపాకులు, ఆయుధాలు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఉదల్గురి జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలతోపాటు పెద్ద మొత్తంలో నగదు లభించింది.


అసోం పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు గౌహతి పోలీస్ కమిషనర్ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపారు.


logo