మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 22, 2020 , 13:18:10

తల్లీకూతుళ్లకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం

తల్లీకూతుళ్లకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం

హైదరాబాద్‌ : చందానగర్‌ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇంటి యజమాని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అద్దెకున్న వారికి ఆహారంలో ఇంటి యజమాని మత్తు మందు కలిపి ఇచ్చినట్లు సమాచారం. ఆ ఆహారం తిని తల్లి(35), కూతురు(15), కుమారుడు(10) స్పృహ కోల్పోయారు. స్పృహలో లేని మహిళ, కుమార్తెపై ఇంటి యజమానితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్పృహలో లేని తల్లి, కుమార్తెను ఉస్మానియా ఆస్పత్రికి, కుమారుడిని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 


logo