బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 01, 2020 , 16:30:19

ఇల్లు కూలి వృద్ధురాలి మృతి.. నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బీరం

ఇల్లు కూలి వృద్ధురాలి మృతి.. నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బీరం

నాగర్ కర్నూల్ : జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోడేర్ మండల కేంద్రంలో బసవమ్మ అనే వృద్ధురాలు ఇంటి మిద్దె కూలి మరణించింది. కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మృతిరాలికి నివాళులు అర్పించారు. తక్షణ సాయంగా మృతురాలి కుటుంబ సభ్యులకు రూ. 20 వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా నష్ట పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.