సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 19:30:36

శవం మీద ఆభరణాలు దొంగలించిన దవాఖాన సిబ్బంది.. కేసు నమోదు

శవం మీద ఆభరణాలు దొంగలించిన దవాఖాన సిబ్బంది.. కేసు నమోదు

హైదరాబాద్ : బంజారా హిల్స్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించిన మహిళకు చెందిన విలువైన ఆభరణాలు దవాఖాన సిబ్బంది దొంగిలించారని ఆరోపిస్తూ ఆమె కుమారుడు బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. బంజారా హిల్స్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న కొంతమంది తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కింగ్ కోటి నివాసి అయిన 75 ఏండ్ల మహిళకు కరోనా లక్షణాలు ఉండడంతో జూలై 22న దవాఖానలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మూడు రోజుల తరువాత మరణించింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు దవాఖాన నుంచి తుది కర్మల కోసం శ్మశానవాటికకు తరలించారు. దవాఖానకు తీసుకువచ్చినప్పుడు మహిళ డైమండ్ రింగ్‌తో పాటు ఆభరణాలు ధరించిందని మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే ఆమె మరణం తరువాత అవి శరీరంపై లేవని, దవాఖాన సిబ్బందిని అడగ్గా ఆ మహిళ ఏమీ ధరించలేదని ఖండించినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo