మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 10:29:31

కొవిడ్ వార్డులో మైన‌ర్ పై అత్యాచారం

కొవిడ్ వార్డులో మైన‌ర్ పై అత్యాచారం

పాట్నా : కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ మైన‌ర్ పై ఆస్ప‌త్రి సెక్యూరిటీ గార్డు అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న పాట్నా మెడిక‌ల్ కాలేజీ హాస్పిట‌ల్ లో జులై 8న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఓ బాలిక చికిత్స నిమిత్తం కొవిడ్ ఐసోలేష‌న్ వార్డులో చేరింది. బాలిక ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఆమెపై అక్క‌డ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అత్యాచారం చేశాడు. చికిత్స అనంత‌రం బాధితురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్నారు. నిందితుడిపై పోక్సో చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. బాలిక మెడిక‌ల్ రిపోర్టు రెండు, మూడు రోజుల్లో వ‌స్తుంద‌ని, ఆ త‌ర్వాత నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌ల తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

నేనేవ‌రిని అత్యాచారం చేయ‌లేదు

ఈ ఘ‌ట‌న‌పై సెక్యూరిటీ గార్డు స్పందిస్తూ.. తానేవ‌రిని అత్యాచారం చేయ‌లేద‌ని చెప్పాడు. గ‌త మూడు నెల‌ల నుంచి ఇక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్నాను. విచార‌ణ నిమిత్తమ‌ని చెప్పి త‌న మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు అని అత‌ను పేర్కొన్నాడు. 


logo