మంగళవారం 19 జనవరి 2021
Crime - Sep 18, 2020 , 11:05:56

యూపీలో పరువు హత్య.. కుమార్తెను గొంతుకోసి కడతేర్చిన తండ్రి

యూపీలో పరువు హత్య.. కుమార్తెను గొంతుకోసి కడతేర్చిన తండ్రి

బరేలీ : ప్రేమించిన పాపానికి కుమార్తెను కన్నతండ్రే కిరాతకంగా కడతేర్చాడు. యూపీలోని రాంపూర్‌ జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. రాంపూర్ జిల్లా భరత్పూర్ గ్రామానికి చెందిన నూర్ అహ్మద్‌కు ముగ్గురు కుమార్తెలు. కొంతకాలంగా ఛండీఘఢ్‌కు వలసవెళ్లి భార్యాబిడ్డలతో కలిసి ఉన్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా నాలుగునెలల క్రితం వారు స్వగ్రామానికి వచ్చారు. అహ్మద్‌ పెద్ద కుమార్తె (16) గతంలో ఛండీఘడ్‌లో ఓ యువకుడిని ప్రేమించింది.

ఇటీవల అతడిని కలిసేందుకు రెండుసార్లు ఇంటి నుంచి పారిపోయింది. గురువారం మరోమారు ఛండీఘడ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తండ్రి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో ఆవేశానికి లోనైన అతడు కుమార్తె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం షాబాద్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడని ఎస్పీ షోగూన్‌ గౌతమ్‌ తెలిపారు. కుమార్తె కుటుంబం పరువు తీస్తున్న కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నిందితుడు పోలీసుల ఎదుట పేర్కొన్నాడు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.